నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు రోజూ నేను నా ఫ్రెండ్ అనురాధ ఒక ఖాళీ స్థలంలో నుంచి స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. ఒక సారి ముందు రోజు రాత్రి వానపడి నేల తడిసి ముద్ద అయ్యింది . కొన్ని చోట్ల నీళ్ళతో నిండిన చిన్న చిన్న గుంటలు. ఒక పెద్ద నీళ్ళ గుంట దగ్గర ముగ్గురు పిల్లలు నిలబడి ఏదో తిలకిస్తున్నారు . మేము కూడా కుతూ హలంతో దగ్గరికి వెళ్లి తొంగి చూసాము . ఓ ప్రాణం లేని పసిగుడ్డు తేలుతూ ఉంది, ఆ తెల్లవారే పుట్టిందో ఏమో తెలియదు . అంత పసిగుడ్డుని చూడడం అదే మొదటిసారి . ఇప్పటికి గుర్తుకు వచ్చినా ఆ పసిగుడ్డు కళ్ళలో మెదులుతుంది . నాకు చాలా వింతగా , ఆశ్చర్యంగా అనిపించింది. ఆ శిశువుకి ప్రాణం లేదని నా ఫ్రెండ్ చెబితేనే తెలిసింది.
ఆ బిడ్డ తల్లి గురించి, ప్రవర్తన గురించి ఆ వయస్సులో నా ఫ్రెండ్ చెబుతుంటే అర్ధం అయి అర్ధం కాని విషయాలు ఎన్నో నాకే సమాధానం తెలియని, దొరకని ప్రశ్నలు మెదిలాయి అందులో తల్లి అలా బిడ్డను ఎలా ఒదిలేసిందని ఒకటి .
ఆ విషయం మర్చిపోయాననుకున్నాను . కాని ఇన్నాళ్ళ తరువాత పునరావృత్తం అయిన జ్ఞాపకాలలో ఆ ఘటన గమనిస్తే ఏ పరిస్థితులలో ఆ కుటుంబం ఆ తల్లి ఆ పని చేసారో కదా అనిపించింది. ఆ చిన్ని శరీరానికి చిన్న స్థలం ఒక అడుగున్నర స్థలం ఇవ్వలేని ఈ విశాల మానవ సమాజం , ఆ పసిగుడ్డుని అక్కున చేర్చుకునే అవకాశం అవనికి అందకపోవడం ఎవరి దురదృష్టమో. ఓ ప్రాణికి కేవలం ఓ సమాధి ఓ పువ్వు కూడా ప్రాప్తించని సహా ఉన్నత ఆధునిక సాంఘీక వ్యవస్థ లో ఐశ్వర్యమంతా నిరుపయోగమే కదా?

No comments:
Post a Comment