Saturday 19 August 2023

Teacher Education Files .....CASE 184

 

            CASE 184 

                                       ఓ  B.Ed కాలేజీలో ఎనిమిదిమంది స్టూడెంట్స్ ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్  చేరారు .  మేము రికార్డ్స్ రాయము.  వర్క్ చేయము అని ముందే చెప్పారట అందుకే  మేము చేయము అని మొండి పట్టు పట్టసాగారు.  కొనుక్కుంటే  వచ్చేది సర్టిఫికెట్ కష్టపడి నేర్చుకుంటే వచ్చేది విద్య అని తెలిసో తెలియకో నమ్మేదాన్ని. చాలా సులువైన ఒక వారం రోజుల ప్రాజెక్ట్ కి   వాళ్ళు రాలేదు. కనీసం రికార్డు రాయండి అని వాళ్లకి టైపడ్ పేపర్స్ లో గైడ్ లైన్స్  ఇస్తే  రికార్డ్స్ రాయలేదు సరి కదా వారిలో ఇద్దరు ముగ్గురు రాసిన రికార్డ్స్ చూస్తే  ఒక స్కూల్ పిల్లవాడు కూడా అంత ఘోరంగా వ్రాయఁడు. వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ కి  చదువులు వల్లెవేయిస్తున్నారు. 

సరే అమ్మ మీ రికార్డ్స్ కి తగట్టు మార్క్స్  వేస్తాము అన్నాను అంతే అస్సలు రాయమన్న వాళ్ళం రాయడమే ఎక్కువ పైగా మార్క్స్ ఎందుకు తక్కువ వేస్తారు aggressive behavioral  reaction  ఇవ్వడం మొదలు పెట్టారు . వాళ్ళు అరిస్తే నేను భయపడి గమ్మునుంటాను అనుకున్నారు. తిరిగి వాళ్లకి గట్టిగానే సమాధానం చెప్పాను . మీ డిగ్రీ స్టూడెంట్స్ రికార్డ్స్ ఇలా వ్రాస్తే మీరు ఒప్పుకుంటారా ? అని  ప్రశ్నించాల్సి వచ్చింది . ఏడవడం మొదలు పెట్టారు.వాళ్ళకి నచ్చచెప్పి కాలేజి కారులో వాళ్ళని నా తో కొంచెం  దూరం తీసుకెళ్లి దింపాను .  

కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డిగ్రీ కాలేజీ  డైరెక్టర్ నా దగ్గరకి వచ్చి వాళ్ళు రికార్డ్స్ రాసే టైం ఉండదు వాళ్ళు డిగ్రీ classes తీసుకోవాలి అన్నాడు. డిగ్రీ లెక్చరర్స్  కి  కూడా  బి.ఎడ్ ట్రైనింగ్ అవసరం అని గవర్నమెంట్ రూల్ తెస్తుందని ముందే తన దగ్గర పని చేసే ఎనిమిది మంది లెక్చరర్స్ ని ఈ కాలేజీ లో చేర్పించాడు ఆ కాలేజీ డైరెక్టర్ . అందుకే వారి తరుపున నాకు నచ్చచెప్పడానికి వచ్చాడు. 

                       నాకు అర్థం కానిది వాళ్ళ కాలేజి స్టూడెంట్స్ ని అయితే అలా వర్క్ చేయకుండా ఒదిలిపెట్టేస్తారా ? డబ్బుతో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ని కొనేయొచ్చు అనే వారి దృక్పథం మంచిదే కాదు అందునా డబ్బు పడేసి చేయవల్సిన కోర్స్ వర్క్  చేయకుండానే గట్టెక్కేయవచ్చు అనే వారి ఆలోచన కంటే మేము డబ్బు కట్టాము మేము ఎందుకు రాయాలి అనే వారి యోచన చాలా ప్రమాదకరమైంది. వాళ్ళ ఈ ప్రమాదకరమైన attitude వైఖరి మార్చాలి అని నిశ్చయించుకున్నాను . వారు నాతో పోట్లాడినంత సేపట్లో ఓక రికార్డు  పూర్తి చేయొచ్చు కదా !

అన్నిటికంటే చిత్రం ఒక విద్యా సంస్థ యజమాని తన లెక్చరర్స్ కేవలం ఒక కొనుకున్న సర్టిఫికెట్ తో తన సంస్థకి ఉపయోగపడతారు అనుకోవడం ఎంతటి అజ్ఞానం. knowledge & skills అంగడి సరుకా అవలీలగా కొనేసుకుని మూటగట్టుకుని వెళ్లిపోవడానికి . 

అన్నిటికి మించి  పావుకిలో వంకాయలు కొన్నా పుచ్చులు ఉండొద్దని ఏరి ఏరి తీసుకుంటామే మరి  చదువు కొన్నా quality ఉండాలని కోరుకోవాలి కానీ ఈ వైరుధ్యం contradiction ఏంటి ?

తన క్రింద పనిచేసే వారి ఉన్నతి కి సౌలభ్యం ఇచ్చినట్లు అనుకుంటే మరి వారికి కొన్ని రోజులు కోర్స్ వర్క్ చేసుకోవడానికి  కనీసం టైం అయినా కేటాయించొచ్చు కదా . లేదే తన కాలేజీ లో వర్క్ చేయించుకుంటూ  వాళ్ళ కోర్స్ వర్క్ వాళ్ళు చేయకుండా ఏమి తెలుసుకోకుండా, పూర్తిగా సంపూర్ణనంగా వారి మేధస్సు నైపుణ్యాలు ఎదగనీయకుండా చేస్తున్న ఆలోచన intent  కాపిటలిస్ట్ స్వార్థంతో నిండి ఉంది కదా.  

కానీ విచిత్రం ఏంటో తెలుసా  ఆ స్టూడెంట్స్ మూర్ఖత్వం.  తమకి తమ డైరెక్టర్ సహాయం చేస్తున్నాడు తమ  కోసం వచ్చి మాట్లాడుతున్నాడు అని మురిసి పోయి నేనే ఏమి వినడం లేదని నా మీద కోపం తెచ్చుకున్న   వనితలకు ఒక ప్రశ్న మీ maturity కి అతడు తన సహాయం ముసుగులో మీ శ్రమను దోపిడీ చేస్తున్నాడని మీ ఉన్నతిని అడ్డుకుంటున్నాడని అనిపించలేదా ?  

విద్య సమానత్వాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేసి మనని సత్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది అదే సరి అయిన జ్ఞానం.  

                                    

                                                         

Wednesday 16 August 2023

Teacher Education Files .....CASE FILE 152

CASE FILE 152


స్టాఫ్ రూమ్లో ఒక రోజు ఒక స్టూడెంట్ నాకు ఒక స్కూల్ ఉంది అందుకోసం బీఎడ్ చేస్తున్నాను అన్నాడు   సరే మోడల్స్ చేయాలి అని ఎలా చేయాలో చెప్తున్నా.  ఇవన్నీ చిన్న పిల్లల ఆట వస్తువుల్లా ఉన్నాయి ఇవి నేను తయారు చేయడం ఏంటి అన్నాడు . నువ్వు స్కూల్ టీచర్ ట్రైనింగ్ కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ లెవెల్ కి దిగి వాళ్లకి అర్థం అయ్యేటట్లు చెప్పాలి  అందుకే ఈ బోధనోపకరణాలు అని వివరంగా చెప్పాను. ముందైతే క్లాస్ లో కూర్చుని క్లాస్ విను అని అంటే క్లాస్ కి వెళ్ళాడు. కాసేపటికే బైటకు వెళ్ళిపోయాడు ఒక పదిహేను నిముషాల తర్వాత వచ్చి మేడం నా వల్ల కాదు నేను మోడల్స్ చేయలేను అన్నాడు . క్లాస్ లో ఒక పదిహేను నిముషాలు కూడా కూర్చోలేని వాడు టీచింగ్ ఎలా చేస్తాడు అర్థం కాలేదు నాకు 

ఇంతలో అతని దగ్గర వస్తున్న సిగరెట్ కంపు అంతా ఇంతా కాదు బైటకు వెళ్లి ఇతను చేసిన పని సిగరెట్ కాల్చడం గంట కూడా సిగరెట్ తాగకుండా ఉండలేని వాడు మంచి టీచర్ ఎలా అవుతాడో   ప్రశ్నార్థకమే .  స్త్రీల దగ్గర అందులో కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర సిగరెట్ కంపు తో నిలబడి మాట్లాడే వాడు విద్యార్థి .  ఏమనాలో అర్థం కావడంలేదు . విద్యను అమ్మడానికి తప్ప విద్య నేర్చుకోవడానికి పనికి రానివాడు.  సంస్కార హీనులు టీచర్స్ అయితే  సంస్కారాన్ని నేర్పగలరా ?స్కూల్స్ బైట టీచర్స్  సిగరెట్లు తాగడం చూసి సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్న విద్యార్థులు ఎందరో.  మంచికే కాదు చెడుకి కూడా టీచరే inspiration . చెడు అలవాట్లలో తాను మగ్గుతూ విద్యార్థులను బలి చేసేవాడు ఉపాధ్యాయ వృత్తికే అనర్హుడే కదా  .  

స్కూల్ ని ఒక విద్యాలయంగా కాకుండా మార్కెట్ ప్లేస్లా  చూసేవాడ్ని  దేశ ద్రోహి గానే పరిగణించవచ్చు  కదా ?


Sunday 13 August 2023

Teacher Education Files .....CASE 231

 

 CASE 231

                          " నాకు టైం ఉండదు . ఇద్దరు చిన్న పిల్లలు,  మా సరుకుల దుకాణం చూసుకోవాలి. ఇంటి పని అంతా చేయాలి నాకు అస్సలు ఈ కోర్స్ చేయడం ఇష్టం లేదు.నా హస్బెండ్ కి  ఈ కాలేజీ గురించి ఎవరో  చెబితే నన్ను చేర్చారు. "

                 మాతో  మాట్లాడుతోంది ఓ అమ్మాయి  స్టాఫ్ రూమ్

 లో , ఆమె భర్త RTC డ్రైవర్ . ఆ అమ్మాయి మా

 బీఎడ్ విద్యార్థిని .  విద్యని అర్థించడం లేదు కేవలం

 సర్టిఫికేట్ ని కాంక్షిస్తోంది . ఆమే  కాదు ఆమె భర్త  కూడా ఆమె

 సర్టిఫికెట్ ద్వారా ఆమె సంపాదనని కాంక్షిస్తున్నాడు . ఆమె

 స్టాఫ్ రూమ్ లో మాట్లాడుతుండగా రెండు సార్లు ఫోన్ చేసాడు

 ఆమె భర్త . కుదరదని అంటున్నారని చాలా నింపాదిగా

 చెప్పింది . ఫోన్ లో అరుస్తూనే ఉన్నాడు ఆ భర్త . 

                భర్త అంటే భార్యని భరించేవాడని అర్థం కానీ

    భార్యే భర్తని భరించడం భారతావనికి  మామూలే కదా!

ఫోన్ పెట్టేసాక నాకు ఇదే టార్చర్ మేడం అన్నది. భర్తలు

 కూడా భార్యల సంపాదనకై ఎంత కక్కూర్తి పడుతున్నారో

 చూస్తే కుటుంబాలు విచ్చిన్నం కావడంలో వింతేముంది

 అనిపిస్తుంది  

ఒకటే ఒక్క క్షణం ఆలోచిస్తే  వారిద్దరిది మెలోడ్రామా

 అయినా పర్లేదు నవ్వుకోడానికి సరిపోతుంది 

కానీ ఒకవేళ పరిస్థితి చేయి దాటితే 

విద్య పట్ల ఆమె అయిష్టత , నిస్సత్తువ పెరిగితే 

అతని దాస్టికం కూడా ఇంకెన్నో రెట్లు పెరిగితే 

ఆమె బలికో వెలికో కారణం అయితే 

ఎవరిదీ బాధ్యత ?

ఇలా  జరగనే కూడదు అని నా అభిలాష . వారు హ్యాపీ

 ఫామిలీగా జీవితం గడపాలనే నా శ్రేయోభిలాష 

ఏమై ఉంటుంది కారణం ?

లూరింగ్ పర్సన్స్ into a కోర్స్ వితౌట్ థేయిర్ interest ??

టేకింగ్ willingness లెటర్ ఫర్ డూయింగ్ ది కోర్సు మే బి ఒక 

 passive సొల్యూషన్ అవ్వొచ్చు. 

 కానీ నా ఆలోచనా తరంగం నేరం  వైపు అడుగు వేస్తున్న

 ఒక ప్రయాణం గురించి , విద్యాలయాలలోనే   నేరానికి

 అంకురార్పణ జరిగే అవకాశాల గురించి ఎగసింది . 

 

  

                   

Saturday 3 June 2023

Abaddam

                                                                    అబద్దం 

                               అబద్దం అంటే ఏంటో నాకు ఐదవ ఏట తెలిసింది . నాన్న చాలా బిజీ గా ఉండడం వల్ల అమ్మ అన్నీ తానే అయి మమల్ని చూసుకోవాల్సి వచ్చేది అప్పుడు తమ్ముడు నెలల పసికందు . ఒక రోజు మార్కెట్ కి వెళ్తూ అమ్మ ఒక అమ్మాయిని,  అప్పుడు ఆమె వయస్సు బహుశా పదిహేను సంవత్సరాల పైనే ఉంటుంది, తమ్ముడిని చూసుకోవడానికి ఇంట్లో ఉంచి వెళ్ళింది. ఆ అమ్మాయి తమ్ముడిని వదిలి మా ఇంటి పెరటి గోడ ఎక్కి నడవడం మొదలు పెట్టింది .  నన్ను కూడా ఎక్కమంది నేను తన వెనకాల గోడెక్కి నడుస్తున్నాను . దూరం నుంచి తెలిసిన వాళ్ళు మా ఇద్దరినీ చూసి మా అమ్మతో చెప్పారు . అమ్మ ఆ అమ్మాయిని గట్టిగా అడుగుతుంటే మేమస్సలు గోడనే ఎక్కలేదు అని చెప్పింది . అమ్మ నువ్వు అబద్దం చెప్తున్నావు అంది . అదిగో అప్పుడు మొదటిసారి విన్నా "అబద్దం" అనే పదం. 

                            గోడ ఎక్కి నడిచినా ఎక్కలేదు అని ఆ అక్క ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు . చాలా సునాయాసంగా ఎంతో మామూలుగా జరిగిన దానిలానే చెప్పేసింది. ఇన్ని సంవత్సరాలైనా  ఆ "అబద్దం" నేను మర్చిపోలేదు. 

                        అందంగా అబద్దం చెప్పడం కూడా నాకు రాని కళే అని చెప్పొచ్చు . కొందరు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేదంతా అబద్దమే అని తెలుస్తుంది కానీ వింటాము నమ్ముతాము అదే మాయ.  

                   మాయ మన చుట్టూ ఎన్నో అబద్దాలను పేర్చుకుంటూ పోతుంది వాటిని ఛేదించుకుంటూ ఒక పద్మ వ్యూహాన్ని దాటుకుంటూ నిజాన్ని చేరుకోగలగాలి. ఆ తరువాత జీవితంలో ఎన్నో అబద్దాలను చవి చూసాను . ఎంతో ఆశ్చర్యం వేసేది . ఎన్ని రకాల అబద్దాలు వాటికి ఎన్ని కారణాలు . భయం, ప్రేమ, హాస్యం, అవసరం, గుర్తింపు, అవమానం, అసూయ,సరదా, బాధపెట్టడం కోసం, బాధపెట్టడం ఇష్టం లేక, జాలి, మోసం, ద్వేషం ఇలా ఎన్నో ఎన్నెనో కారణాలు. 

                         అనురాధ నా క్లాస్ అమ్మాయి, స్కూల్ అయ్యాక  ఒక ఐదు మందిమి  నడిచి వెళ్ళేవాళ్ళం ఒక రోజు ఒక ఇంటి ముందు ఆగి మా అత్తమ్మ ఇల్లు, తలుపు కొట్టి పిలు ఓ విషయం చెప్పాలి అంది ఓ నాలుగు మెట్లు ఉంటాయి ఆ  ఇంటి ముందు తాను ఎక్కలేను TIRED గా ఉంది అంది సరే అని నేను మెట్లు ఎక్కి తలుపు కొట్టాను ఒక పెద్దావిడ తలుపు తీసి ఏంటి అంది వినక్కి తిరిగి  చూస్తే అందరు దూరంగా పరుగెత్తు కుంటూ నవ్వుకుంటూ వచ్చేయి అని నాకు సైగ చేస్తూ ... నేను గబ గబా మెట్లు దిగుతూ  ఆవిడ  తిట్ల దండకం వింటూ  పరుగు లంఘించుకున్నా. వీళ్ళ వినోదం  కోసం పెద్దావిడని కష్ట పెట్టాము 

                             నమ్మించడం ఇంటెలిజెంట్ ఆక్ట్, నమ్మడం FOOLISHNESS అని మనిషి అనుకునేటంత  కాలం అబద్దం గెలుస్తూనే ఉంటుంది 

                                       అకారణంగా ఏదో  గాలివాటుగా అబద్దం చెప్పడం అన్నిటి కంటే విచిత్రం వీరినే సైకాలజీ లో "Pathetic liars " అంటారు. అనవసరంగా  "Without any motive they lie just like that . "

                       నూరు అబద్దాలు చెప్పి అయినా ఒక  పెళ్లి

 చేయమన్నారు అది ఒకప్పటి సంగతి ఇప్పుడు ఎన్ని

 అబద్ధాలైనా   చెప్పి విడాకులు తీసుకుంటున్నారు 

                        ధర్మరాజు అశ్వథామ హతః కుంజరః అంటే 

కుంజరః అనే మాటను వినకుండా భేరి నాదం తో

 కప్పిపెట్టి    ఓ ద్రోణాచార్యుణ్ణే మట్టుపెట్టిన వైనఁ ,

 ఎల్లప్పుడూ సత్యమే పలికే వ్యక్తి దాచే నిజానికి, ఆడే

  అబద్ధానికి ఉన్న శక్తిని తెలుపుతుంది. తెలివిగా సగం

 నిజాన్ని ఆయుధంగా వాడిన కృష్ణుని ధర్మయుద్ధం

 కలియుగ ఆరంభానికి నాంది పలికిందేమో . 

                           అందుకే కలియుగం లో  అబద్దానికే ఎక్కువ

 విలువ . అబద్దాన్ని బ్యాంకు లో  డబ్బులా జాగ్రత్తగా

 వాడుకోవాలి . అనవసరంగా వృథా చేసుకోకూడదు . 

                           నిజమే ఎందుకు చెప్పాలి అని అడిగే

 వాళ్ళకి  ఇది ఓ దృక్పథం కావాలి .  


                          అస్సలు ఇదంతా నేను రాయడానికి కారణమైన సంఘటన....  ఒక inspection కమిటీ member ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ఎంత దూరం లో ఉంది అని అడిగారు.   డయల్ 101 కాలం లో  పోలీస్ స్టేషన్  ఎక్కడ ఉన్నా హెల్ప్ ought to రీచ్ us కదా . నాకు తెలియదు అని నిజమే చెప్పాను . ఏదో ఒక దూరం కొలత చెప్పొచ్చుగా అన్నాడు అతను , దాని బదులు నీకు అది కూడా తెలియదా అన్నా బావుండును. ఎదురుగుండా కూర్చున్న చైర్మన్ గారు అబద్దం చెప్పడం కూడా రాదు అని సణుక్కోవడం హైలైట్ . అబద్దం చెప్పడం ఓ పెద్ద సర్టిఫైడ్ qualification అయినట్లు . ఫ్యూచర్ లో lying స్కిల్స్....  హౌ to lie elegantly  అనే కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారేమో . 


                                ఎప్పుడూ  అబద్దం ఆడే వాడి మాటకు

 విలువ ఉండదు కొందరి వ్యక్తుల పేరులోనే సత్యం

 ఉంటుంది కానీ అన్నీ  అసత్యం ఒలికే పలుకులే...  అవి

 అసత్యాలు అని మనకి తెలిసే లోగా జరగాల్సిన అనర్థాలు

 జరిగిపోతాయి. 

                                 అందుకే పూర్వ కాలం అబద్దాలు

 ఆడేవాడికి తథాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అనే

 వాళ్ళు. అదే వాళ్లకి పెద్ద శిక్ష . 

                                                               

                                 నిజాన్ని కప్పేసే శక్తి సమాజానికి

 ఉండడం వాస్తవమే అయినా ఆ అబద్దం ఏదో ఒక రోజు

 తమ సమాజాన్నే నివురుగప్పిన నిజమై కాల్చేస్తుందని 

తెలిసిన నాడు మనిషి  సత్యం వద  అని ఆచరిస్తాడు


              నాన్న నేర్పిన ఒక శ్లోకం 

ప్రియంచ  బృయాత్ సత్యం బృయాత్ 

అప్రియం నాబ్రూయాత్  అసత్యం నాబ్రూయాత్ 

ప్రియంచ అసత్య అబ్రుయాత్ 

  సత్యం అప్రియఞ్చ నభృయాత్ 


ప్రియమైనది పలుకు , నిజం పలుకు 

అప్రియమైనది  పలుకకు ,  నిజం కానిది పలుకకు , 

ప్రియమైన అసత్యం పలుకకు , 

అప్రియమైన సత్యాన్ని పలుకకు . 


                             సత్యమేవ జయతే