Monday, 7 April 2025

entha baavundo !

ఆంధ్ర జ్యోతి లో  publish  అయిన నాకు నచ్చిన  మరో కవిత 

దుఃఖం అడ్డుపడ్డ పద్యం 

పద్యo  గొంతులో పెను దుఃఖం ఏదో అడ్డుపడింది 

అందమైన , సొగసు పదాల్ని పలుకలేక 

దాని పెదవులు వణికాయి 

సముద్రపు చీకటి అగాధాలవలే  ఎంతో లోతైన 

మహా పర్వత శిఖరాలవలే   అత్యు న్నతమైన 

చిక్కటి చీకటి కారడువులవలే  అతి విస్తారమైన 

"కోల్పోవడం, కోరుకోవడం" 

అనే అతి క్లుప్త, అత్యంత బరువైన 

రెండు మహా పదాల శబ్దాలు 

మనిషి హృదయంలో నుంచి పలికిన 

సన్నటి దుః ఖ జీరవలే దానికి వినపడ్డాయి 

ఆ రెండు సర్వోతృకృష్ట  

పదాల మధ్య 

కవిత్వం ఒక ఊగే ఆశల వంతెనను కడుతుంది 

ఆ తర్వాత, అనేక మార్లు 

వికసించి, వాడి, రాలిపోయి 

పునర్జీవించే చేయి పట్టుకుని 

ఆ వంతెనపై కవిత్వం మెల్లిగా నడిచింది 

మానవ మహావిషాదాన్ని  అనునిత్యం 

అతి దగ్గరగా చూసే 

పద్యం గొంతులో ఎప్పుడూ 

దుఃఖ సుడిగుండాలు అడ్డుపడతాయి 

వణికే దాని పెదవులు 

అయినా పలుకుతాయి ఇలా 

జీవించు, పోరాడు, జీవించు                              

                                                                                 విమల  


No comments:

Post a Comment