Saturday 19 August 2023

Teacher Education Files .....CASE 184

 

            CASE 184 

                                       ఓ  B.Ed కాలేజీలో ఎనిమిదిమంది స్టూడెంట్స్ ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్  చేరారు .  మేము రికార్డ్స్ రాయము.  వర్క్ చేయము అని ముందే చెప్పారట అందుకే  మేము చేయము అని మొండి పట్టు పట్టసాగారు.  కొనుక్కుంటే  వచ్చేది సర్టిఫికెట్ కష్టపడి నేర్చుకుంటే వచ్చేది విద్య అని తెలిసో తెలియకో నమ్మేదాన్ని. చాలా సులువైన ఒక వారం రోజుల ప్రాజెక్ట్ కి   వాళ్ళు రాలేదు. కనీసం రికార్డు రాయండి అని వాళ్లకి టైపడ్ పేపర్స్ లో గైడ్ లైన్స్  ఇస్తే  రికార్డ్స్ రాయలేదు సరి కదా వారిలో ఇద్దరు ముగ్గురు రాసిన రికార్డ్స్ చూస్తే  ఒక స్కూల్ పిల్లవాడు కూడా అంత ఘోరంగా వ్రాయఁడు. వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ కి  చదువులు వల్లెవేయిస్తున్నారు. 

సరే అమ్మ మీ రికార్డ్స్ కి తగట్టు మార్క్స్  వేస్తాము అన్నాను అంతే అస్సలు రాయమన్న వాళ్ళం రాయడమే ఎక్కువ పైగా మార్క్స్ ఎందుకు తక్కువ వేస్తారు aggressive behavioral  reaction  ఇవ్వడం మొదలు పెట్టారు . వాళ్ళు అరిస్తే నేను భయపడి గమ్మునుంటాను అనుకున్నారు. తిరిగి వాళ్లకి గట్టిగానే సమాధానం చెప్పాను . మీ డిగ్రీ స్టూడెంట్స్ రికార్డ్స్ ఇలా వ్రాస్తే మీరు ఒప్పుకుంటారా ? అని  ప్రశ్నించాల్సి వచ్చింది . ఏడవడం మొదలు పెట్టారు.వాళ్ళకి నచ్చచెప్పి కాలేజి కారులో వాళ్ళని నా తో కొంచెం  దూరం తీసుకెళ్లి దింపాను .  

కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డిగ్రీ కాలేజీ  డైరెక్టర్ నా దగ్గరకి వచ్చి వాళ్ళు రికార్డ్స్ రాసే టైం ఉండదు వాళ్ళు డిగ్రీ classes తీసుకోవాలి అన్నాడు. డిగ్రీ లెక్చరర్స్  కి  కూడా  బి.ఎడ్ ట్రైనింగ్ అవసరం అని గవర్నమెంట్ రూల్ తెస్తుందని ముందే తన దగ్గర పని చేసే ఎనిమిది మంది లెక్చరర్స్ ని ఈ కాలేజీ లో చేర్పించాడు ఆ కాలేజీ డైరెక్టర్ . అందుకే వారి తరుపున నాకు నచ్చచెప్పడానికి వచ్చాడు. 

                       నాకు అర్థం కానిది వాళ్ళ కాలేజి స్టూడెంట్స్ ని అయితే అలా వర్క్ చేయకుండా ఒదిలిపెట్టేస్తారా ? డబ్బుతో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ని కొనేయొచ్చు అనే వారి దృక్పథం మంచిదే కాదు అందునా డబ్బు పడేసి చేయవల్సిన కోర్స్ వర్క్  చేయకుండానే గట్టెక్కేయవచ్చు అనే వారి ఆలోచన కంటే మేము డబ్బు కట్టాము మేము ఎందుకు రాయాలి అనే వారి యోచన చాలా ప్రమాదకరమైంది. వాళ్ళ ఈ ప్రమాదకరమైన attitude వైఖరి మార్చాలి అని నిశ్చయించుకున్నాను . వారు నాతో పోట్లాడినంత సేపట్లో ఓక రికార్డు  పూర్తి చేయొచ్చు కదా !

అన్నిటికంటే చిత్రం ఒక విద్యా సంస్థ యజమాని తన లెక్చరర్స్ కేవలం ఒక కొనుకున్న సర్టిఫికెట్ తో తన సంస్థకి ఉపయోగపడతారు అనుకోవడం ఎంతటి అజ్ఞానం. knowledge & skills అంగడి సరుకా అవలీలగా కొనేసుకుని మూటగట్టుకుని వెళ్లిపోవడానికి . 

అన్నిటికి మించి  పావుకిలో వంకాయలు కొన్నా పుచ్చులు ఉండొద్దని ఏరి ఏరి తీసుకుంటామే మరి  చదువు కొన్నా quality ఉండాలని కోరుకోవాలి కానీ ఈ వైరుధ్యం contradiction ఏంటి ?

తన క్రింద పనిచేసే వారి ఉన్నతి కి సౌలభ్యం ఇచ్చినట్లు అనుకుంటే మరి వారికి కొన్ని రోజులు కోర్స్ వర్క్ చేసుకోవడానికి  కనీసం టైం అయినా కేటాయించొచ్చు కదా . లేదే తన కాలేజీ లో వర్క్ చేయించుకుంటూ  వాళ్ళ కోర్స్ వర్క్ వాళ్ళు చేయకుండా ఏమి తెలుసుకోకుండా, పూర్తిగా సంపూర్ణనంగా వారి మేధస్సు నైపుణ్యాలు ఎదగనీయకుండా చేస్తున్న ఆలోచన intent  కాపిటలిస్ట్ స్వార్థంతో నిండి ఉంది కదా.  

కానీ విచిత్రం ఏంటో తెలుసా  ఆ స్టూడెంట్స్ మూర్ఖత్వం.  తమకి తమ డైరెక్టర్ సహాయం చేస్తున్నాడు తమ  కోసం వచ్చి మాట్లాడుతున్నాడు అని మురిసి పోయి నేనే ఏమి వినడం లేదని నా మీద కోపం తెచ్చుకున్న   వనితలకు ఒక ప్రశ్న మీ maturity కి అతడు తన సహాయం ముసుగులో మీ శ్రమను దోపిడీ చేస్తున్నాడని మీ ఉన్నతిని అడ్డుకుంటున్నాడని అనిపించలేదా ?  

విద్య సమానత్వాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేసి మనని సత్యానికి దగ్గరగా తీసుకువెళ్తుంది అదే సరి అయిన జ్ఞానం.  

                                    

                                                         

No comments:

Post a Comment